క్రీడలుటాప్ స్టోరీస్

ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా సంజయ్ బంగర్ నియామకం

  • వ్యక్తిగత కారణాల వల్ల హెచ్ కోచ్ గా తప్పుకున్న సైమన్ కటిచ్
  • ప్రస్తుతం ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న సంజయ్ బంగర్
  • రాబోయే రెండేళ్లకు హెడ్ కోచ్ గా బంగర్ నియామకం

ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యారు. రాబోయే రెండు ఐపీఎల్ సీజన్లకు (రెండేళ్లు) ఆయనను హెడ్ కోచ్ గా ఆర్సీబీ యాజమాన్యం నియమించింది. సంజయ్ బంగర్ ఇప్పటికే ఆర్సీబీతో కలిసి పని చేస్తున్నారు. గత కొన్ని సీజన్ల నుంచి ఆయన బ్యాటింగ్ కోచ్ గా సేవలందిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ తొలి దశలో ఆర్సీబీ హెడ్ కోచ్ గా ఉన్న సైమన్ కటిచ్… వ్యక్తిగత కారణాల వల్ల రెండో దశకు దూరమయ్యారు. దీంతో, ఆయన స్థానంలో మైక్ హెన్సస్ హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టారు. ఇకపై ఆయన ఆర్సీబీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కొనసాగుతారు. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ వైదొలిగాడు. ఆయన స్థానంలో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయాల్సి ఉంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close