సినిమా
Trending

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా.. ప్రోమో వీడియో సాంగ్ విడుద‌ల‌

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ పాట‌లు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. థ‌మ‌న్ సంగీత దర్శకత్వంలో సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా అనే సాంగ్ ఎంత హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఆడియో సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించ‌డ‌మే కాక ప‌లు రికార్డులు క్రియేట్ చేసింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోను ఈ సాంగ్‌పై చ‌ర్చ జ‌రిగింది. తాజాగా ఈ సాంగ్‌కి సంబంధించి ప్రోమో వీడియో విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌లో అల్లు అర్జున్‌, పూజా హెగ్డేల లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close