జాతీయం

‘శబరి ఎక్స్ ప్రెస్’ ఇక సికింద్రాబాద్ నుంచి… సమయం కూడా మార్పు !

  • తిరువనంతపురానికి నడిచే రైలు
  • సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12. 20కి 
  • తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12.10కి చేరిక

హైదరాబాద్ నుంచి కేరళలోని తిరువనంతపురం నగరానికి రోజూ నడిచే శబరి ఎక్స్ ప్రెస్ ఇక నుంచి సికింద్రాబాద్ నుంచే బయలుదేరుతుంది. రిటర్న్ వచ్చే రైలు గమ్యస్థానం కూడా సికింద్రాబాద్ మాత్రమే. ఈ మార్పు 27వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇదే సమయంలో రైలు సమయాన్ని కూడా మారుస్తున్నట్టు తెలిపింది. సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 12.20కి బయలుదేరి, నల్గొండకు 2 గంటలకు, గుంటూరుకు 5 గంటలకు చేరుతుందని అధికారులు తెలిపారు. ఇదే విధంగా తిరువనంతపురంలో ఉదయం 7 గంటలకు బయలుదేరే రైలు, మరుసటి రోజు మధ్యాహ్నం 12.10కి సికింద్రాబాద్ చేరుతుందని, ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close