సినిమా

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు .. నాటు’ సాంగ్ ప్రోమో!

  • రాజమౌళి రెడీ చేస్తున్న ‘ఆర్ఆర్ఆర్’
  • మాస్ బీట్ ను కంపోజ్ చేసిన కీరవాణి 
  • సాహిత్యాన్ని అందించిన చంద్రబోస్ 
  • జనవరి 7వ తేదీన సినిమా రిలీజ్

రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం రూపొందుతోంది. పోరాట యోధులైన అల్లూరి – కొమరం భీమ్ చుట్టూ తిరిగే కథ ఇది. వాళ్ల దేశభక్తికి .. త్యాగనిరతికి అద్దం పట్టే కథ ఇది. అలాంటి ఈ సినిమాలో అల్లూరిగా చరణ్ .. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. డిసెంబర్ లో ట్రైలర్ ను వదిలి .. జనవరి 7వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ‘నా పాట సూడు .. నా పాట సూడు .. నాటు .. నాటు .. నాటు .. వీరనాటు’ అంటూ ఈ పాట సాగుతోంది. ఎన్టీఆర్ – చరణ్ పాత్రలపై ఈ పాటను చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది.

కీరవాణి స్వరపరిచిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా .. కాలభైరవ – రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. మాస్ బీట్ లో జోరుగా .. హుషారుగా ఈ పాట నడుస్తోంది. కీరవాణి సంగీతంలో ఈ తరహా పాటలు చాలా తక్కువ వచ్చాయనే చెప్పాలి. ఈ  నెల 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close