సినిమా

‘ఆర్ ఆర్ ఆర్’ నుంచి ఇంట్రస్టింగ్ గ్లింప్స్!

  • చారిత్రక నేపథ్యంతో ‘ఆర్ ఆర్ ఆర్’
  • భారీతనాన్ని చాటుతున్న గ్లింప్స్
  • సినిమాపై మరింత పెరగనున్న అంచనాలు
  • జనవరి 7వ తేదీన విడుదల  

రాజమోళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా, చాలా కాలంగా అందరినీ ఊరిస్తోంది. ఎన్టీఆర్ – చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని, జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన పోస్టర్లు .. స్పెషల్ వీడియోలు అంతకంతకు అంచనాలు రెట్టింపు చేస్తూ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఆంగ్లేయుల ఆధిపత్యం .. అల్లూరి సీతారామరాజు .. కొమరం భీమ్ ల తిరుగుబాటు .. ఎవరిబాటలో వారు సాగించిన పోరాటం తాలూకు విజువల్స్ తో ఈ గ్లింప్స్ కొనసాగింది.

ప్రధానమైన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ .. కంటెంట్ ఏమిటనే విషయాన్ని అర్థమయ్యేలా చెబుతూ కట్ చేసిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో బాలీవుడ్ ఆర్టిస్టులతో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటించారు. ఈ సినిమా కోసం ఏ స్థాయిలో ఖర్చు చేశారనే విషయం ఈ గ్లింప్స్ చూస్తే అర్థమైపోతుంది. ఇక ఇప్పటి నుంచి ఈ సినిమా నుంచి వెంట వెంటనే అప్ డేట్లు ఉంటాయనుకోవచ్చు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close