రాజకీయం

టీడీపీని జూమ్‌చేసి చూడాల్సిందే

నగరి: తెలుగుదేశం పార్టీ జూమ్‌ పార్టీ అని, చంద్రబాబు నాయుడు జూమ్‌ నాయుడని, ఆయనను ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరని, ఆ పార్టీని ఇక జూమ్‌చేసి చూడాల్సిందేనని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని 27 మంది ఎక్సైజ్‌ సిబ్బందికి ఆమె తన స్వగృహం వద్ద బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, అరటిపండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి మద్యంలో ఎక్కువగా సంపాదించుకుంటున్నారంటూ టీడీపీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ చేసిన వ్యాఖ్యలపై రోజా ఘాటుగా స్పందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దశలవారీగా మద్యపాన నిషేధం చేసే ప్రక్రియలో 43 వేల బెల్టుషాపులు, 40 శాతం బార్లు, 33 శాతం వైన్‌ షాపులు తొలగించారని తెలిపారు.

మద్యం విక్రయ సమయాన్ని తగ్గించి.. 75 శాతం ధరలు పెంచి మద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేశారని చెప్పారు. రాష్ట్రంలో 15 డీ అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటుచేసి మద్యానికి అలవాటైన మనిíÙకి కౌన్సెలింగ్‌ ఇచ్చి అందులో నుంచి బయటకు వచ్చి మామూలు జీవితం గడిపే ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల మద్యం మన రాష్ట్రంలోకి వచ్చినా, సారా కాచి విక్రయించాలని చూసినా ఉక్కుపాదం మోపి అణచివేయడానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏర్పాటు చేశారని చెప్పారు. ఇంత చిత్తశుద్ధితో, పారదర్శకంగా జగనన్న ముందుకు వెళుతుంటే. మహానాడులో లోకేష్‌ తలతిక్కగా మాట్లాడుతున్నారని తెలిపారు.

మద్యం సిండికేట్లతో ఇబ్బడిముబ్బడిగా సంపాదించి ఒళ్లు పెంచి నేడు అధికారం పోయేసరిగా 20 కిలోలు తగ్గిపోయారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వారికి అండగా నిలబడలేదన్నారు. వైజాగ్‌లో గ్యాస్‌ లీకేజీ ప్రమాదం జరిగితే కనీసం అక్కడకు వెళ్లని ఆయన విజయవాడలో మహానాడు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలకు ఏ రీతిన అండగా నిలవాలన్న విషయాన్ని పక్కన పెట్టి జగన్‌మోహన్‌రెడ్డిని ఆడిపోసుకోవడానికే మహానాడు పెట్టారరని, దాంతో ఆయన పారీ్టవల్ల ఎలాంటి ప్ర యోజనం లేదని ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాల నుంచి వి శ్రాంతి పొందే దశకు చేరుకున్నారని చెప్పారు. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే: మద్రాసు హైకోర్టు

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close