సినిమా

బాలీవుడ్‌ చాక్లెట్ బాయ్..

బాలీవుడ్ చాక్లెట్ బాయ్‌గా రిషీ క‌పూర్‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది.  సినిమాల్లో అత‌ను వేసే డ్రెస్సులు.. అతను వాడే మ్యూజిక్ ఇన్‌స్ట్రూమెంట్స్‌.. అవ‌న్నీ అత‌న్ని స్టార్‌ను చేశాయి.  హ‌మ్ తుమ్ ఏక్ క‌మ‌రేమే బంద్ హో.. అంటూ బాబీలో సాగిన పాటైనా.. చాందినీ తూ మేరి చాందినీ అంటూ సాగిన  పాటైనా.. రిషీ త‌న స్ట‌యిల్‌తో ఆక‌ట్టుకునేవాడు.  1973లో రిలీజైన్ బాబీ సినిమా త‌ర్వాత‌.. దేశ‌వ్యాప్తంగా అత‌నిపై క్రేజ్ పెరిగింది. యువ‌త గుండెల్లో అత‌ను హార్ట్‌బీట్‌గా మారాడు.  చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి రొమాంటిక్ హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు నుంచి విల‌న్ వ‌ర‌కు .. రిషీ అన్ని రోల్స్ ప్లే చేశాడు.  1952, సెప్టెంబ‌ర్ 4వ తేదీన రిషీ ముంబైలో జ‌న్మించారు. 

మేరా నామ్ జోక‌ర్ సినిమా క‌న్నా ముందు రిలీజైన శ్రీ 420 సినిమాలో బాల క‌ళాకారుడిగా రిషి క‌నిపిస్తాడు. శ్రీ420 సినిమాలో సూప‌ర్ హిట్ సాంగ్‌.. ప్యార్ హువా ఇక్‌రార్ హువా తెలిసిందే. అయితే ఆ పాట సాగుతున్న‌ప్పుడు పిల్ల‌లు న‌డుచుకుంటూ వెళ్లే సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో సోద‌రుడు ర‌ణ్‌ధీర్ క‌పూర్‌తో పాటు తాను కూడా ఉన్న‌ట్లు ఓ సారి రిషి క‌పూర్ తెలిపారు. వాస్త‌వానికి ఆ సాంగ్‌లో క‌నిపించేందుకు రిషీని అంద‌రూ ఒప్పించాల్సి వ‌చ్చింది. చిన్న పిల్ల‌వాడు అయిన రిషికి న‌ర్గీస్ చాక్లెట్ ఇచ్చిన త‌ర్వాత అత‌ను యాక్టింగ్ మొద‌లుపెట్టిన‌ట్లు చెబుతుంటారు. 

లెజండ‌రీ హీరో రాజ్ క‌పూర్ కుమారుడైన రిషీ క‌పూర్‌.. బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా మేరీ నామ్ జోక‌ర్‌తో అత‌ని కెరీర్ మొద‌లైన‌ట్లు చెబుతారు. డింపుల్ క‌పాడియాతో వ‌చ్చిన తొలి ఫిల్మ్‌.. బాజీ ఓ సూప‌ర్ హిట్‌.  ఆ త‌ర్వాత క‌ర్జ్‌, ప్రేమ్ రోగ్, కూలీ, సాగ‌ర్‌, నగినా, చాందినీ, హెన్నా, బోల్ రాథా బోల్‌, దీవానా, హమ్ తుమ్‌, ఫ‌నా, న‌మ‌స్తే లండ‌న్‌, ల‌వ్ ఆజ్‌క‌ల్‌, పాటియాల హౌజ్ లాంటి చిత్రాల్లో రిషి న‌టించాడు. 

మేరా నామ్ జోక‌ర్ సినిమాకు రిషీకి జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కింది. బాబీ సినిమాకు అత‌నికి ఫిల్మ్‌ఫేర్ అవార్డు ద‌క్కింది. భార్య‌, హీరోయిన్ నీతూ సింగ్ క‌పూర్‌తో అత‌ను కొన్ని హిట్ సినిమాల్లో న‌టించాడు.  ఖేల్ ఖేల్ మే, క‌బీ క‌బీ, అమ‌ర్ అక్బ‌ర్ ఆంథోనీ, దూస్రా ఆద్మీ లాంటి చిత్రాల్లో ఈ జంట న‌టించింది. రిషీ క‌పూర్ కుమారుడు ర‌ణ్‌బీర్ కపూర్ కూడా ఈ త‌రం హీరోగా బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. రిషీ క‌పూర్ మ‌ర‌ణం సినీ జ‌గ‌త్తుకు తీర‌ని లోటే.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close