టాప్ స్టోరీస్సినిమా

పిల్లల సమక్షంలోనే రేణుదేశాయ్‌ నిశ్చితార్థం

పవన్ కళ్యాణ్ మాజీ భార్య మరొకరిని వివాహం చేసుకుంటున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే ఘనంగా జరిగింది. వేలికి నిశ్చితార్థం ఉంగరం తొడుక్కుని, అతని చేతిలో చేయి వేసిన ఫోటోను రేణు సోషల్‌ మీడియాలో షేర్ చేసుకున్నారు. అయితే.. అంతకు ఒక్కరోజు ముందు పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో కలిసి విజయవాడలో గృహ ప్రవేశం చేశారు. ఆ సమయంలో పవన్-రేణుల కొడుకు అకీరా తండ్రితో పాటు ఉండడం సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

అకీరాను పవన్‌ దగ్గరకు పంపించేసి, రేణు నిశ్చితార్థం చేసుకుందంటూ కామెంట్లు మొదలయ్యాయి. అయితే దీనికి స్ఫష్టంగా వివరణ ఇచ్చారు రేణు దేశాయ్‌. అకీరా .. పవన్ దగ్గర ఉండిపోవడానికి వెళ్లలేదని, తన సెలవుల్లో కొన్ని రోజులు తండ్రి దగ్గర గడపడానికి వెళ్లాడంటూ ప్రకటించారు.

 

చదవండి: నిశ్చితార్థం చేసుకున్న రేణూదేశాయ్

ఇక నిశ్చితార్థం సమయంలో తన పిల్లలిద్దరూ తన పక్కనే ఉన్నారంటూ ఓ ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు. తన పిల్లలిద్దరూ లేకపోతే తన ఆనందం పరిపూర్ణం కాదన్న రేణు.. తాను జీవితంలో కొత్త దశను ప్రారంభించే సమయంలో వారిద్దరూ తన పక్కనే ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ఫోటోతో అందరి నోళ్లనూ మూయించారు రేణు దేశాయ్.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close