టాప్ స్టోరీస్సినిమా

నిశ్చితార్థం చేసుకున్న రేణూదేశాయ్

సినీనటి రేణూదేశాయ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఫొటో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. గతంలో రెండో పెళ్లి గురించి ప్రస్తావించిన రేణూ తాజాగా తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపింది. జీవిత భాగస్వామి చేతిపై రేణూ చెయ్యేసిన ఫొటోలో నిశ్చితార్థపు ఉంగరాలు మనం గమనించవచ్చు. తన జీవితభాగస్వామి ఎవరో స్పష్టత ఇవ్వలేదు కానీ ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయాన్ని వెల్లడించారు.

పవన్‌ కళ్యాణ్‌ను వివాహం చేసుకున్న రేణు, ఆయన ద్వారా ఇద్దరు పిల్లలను కన్నారు. అయితే, చాలాకాలం అన్యోన్యంగా సాగిన వారి కాపురం అకస్మాత్తుగా ఒడిదుడులకు లోనయ్యింది. దీంతో, పవన్‌ నుంచి విడాకులు తీసుకుని మహారాష్ట్రకు షిఫ్ట్ అయ్యారు రేణు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌ మరో వివాహం చేసుకున్నా, రేణు మాత్రం పిల్లల కోసం ఒంటరిగానే ఉండిపోయారు. కానీ, కొంతకాలం క్రితం ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైనప్పుడు తోడు లేక చాలా ఇబ్బంది పడ్డారట. దీంతో.. తనను ప్రేమించే మరో వ్యక్తి కోసం అన్వేషణ మొదలుపెట్టారు.ఆ విషయం సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో, పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఆమెను దుర్భాషలాడారు. అయితే, ఆమె కూడా వారికి గట్టిగానే సమాధానం చెప్పారు. ఇన్నాళ్లకు తనకు నచ్చిన వ్యక్తి దొరకడంతో నిశ్చితార్థం చేసుకున్నారు. పదిరోజుల క్రితం అతని చేయి పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేసిన రేణు, తాజాగా, నిశితార్థం ఉంగరం తొడుక్కున్న ఫోటోను తన అభిమానులతో పంచుకున్నారు.

చదవండి: పిల్లల సమక్షంలోనే రేణుదేశాయ్‌ నిశ్చితార్థం

అయితే.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను రేణు ప్రైవేట్‌ చేయడంపై సోషల్‌ మీడియాలో చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌లోని ఆకతాయిల నుంచి తప్పించుకోవడానికే ఆమె అకౌంట్‌ను ప్రైవేట్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close