అంతర్జాతీయంటాప్ స్టోరీస్

హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగస్వాముల‌కు గుడ్‌న్యూస్‌

వాషింగ్ట‌న్‌: అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ మ‌రో గుడ్‌న్యూస్ అందించారు. హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యం తీసుకున్నారు. అమెరికాలో హెచ్‌1-బీ వీసాదారుల జీవిత భాగ‌స్వాముల‌కు ఉద్యోగం చేసే అవ‌కాశాన్ని కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఒబామా హ‌యాంలో వాళ్ల‌కు ఈ అవ‌కాశం క‌ల్పించ‌గా.. గ‌త ట్రంప్ ప్ర‌భుత్వం దానిని ర‌ద్దు చేసే ప్ర‌య‌త్నం చేసింది. ట్రంప్ వైట్‌హౌజ్‌లో ఉన్నంత కాలం ఆందోళ‌న‌లోనే ఉన్న హెచ్‌-4 డిపెండెంట్ వీసాదారులు.. తాజా ఉత్త‌ర్వుల‌తో ఊపిరి పీల్చుకున్నారు. హెచ్‌1-బీ వీసాదారుల్లో ఎక్కువ శాతం ఇండియా, చైనా వాళ్లే ఉన్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close