టాప్ స్టోరీస్టెక్నాలజీ

కేవలం రూ.649కే..రెడ్‌మీ నోట్5 ప్రొ మొబైల్

విపరీతమైన పోటా పోటీతో రెండు ఈ కామర్స్ దిగ్గజాలు ప్లిప్‌కార్ట్‌- అమెజాన్‌లు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. మొబైల్స్‌ఫై భారీ ఆఫర్లతో వినియోగదారులను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డాయి. వాల్‌మార్ట్‌తో జతకట్టిన అమెజాన్ సేల్ నేటితో ముగియనుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ డేస్ సేల్ ఈనెల 19వరకు పొడిగించింది.

ఇందులో భాగంగా షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.649కే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. రెడ్‌మీ నోట్5 ప్రొ 4జీబీ ర్యామ్, 64 జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్/64జీబీ వేరియంట్ ధర రూ.16,999. ఈ రెండింటినీ అందుబాటులో ఉంచిన ఫ్లిప్‌కార్ట్ .. 4జీబీ వేరియంట్‌ను రూ.649కు, 6జీబీ వేరియంట్‌ను రూ.2,649కి అందుబాటులో ఉంచినట్టు సంస్థ తెలిపింది.

రెడ్‌మీ నోట్5 ప్రొ(4జీబీ)ని రూ.649కి కావాలనుకునేవారు… ఎక్స్‌చేంజ్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌ చేంజ్‌లో రూ.12,850 వరకు తగ్గింపు లభిస్తుంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే మరో పదిశాతం రాయితీ లభిస్తుంది. ఫలితంగా ఫోన్‌ రూ.649కే సొంతమవుతుందన్నమాట.  అయితే, ఎక్స్‌చేంజ్ చేసుకునే ఫోన్ ధర రూ.12,850కి అర్హత కలిగి ఉంటేనే ఫోన్ ఈ ధరకు లభిస్తుంది. లేదంటే తగ్గిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, 6జీబీ ర్యామ్ వేరియంట్‌కు కూడా ఇదే వర్తిస్తుంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close