అంతర్జాతీయం

క‌మ‌లా హ్యారిస్ ప‌ర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?

వాషింగ్ట‌న్‌: అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా క‌మ‌లాదేవి హ్యారిస్ ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.  ఆ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఆమె ఊదా రంగు దుస్తుల్లో వచ్చారు.  క్యాపిట‌ల్ హిల్ వేదిక‌గా జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి క‌మ‌లా హ్యారిస్ మాత్ర‌మే కాదు.. మాజీ ఫ‌స్ట్ లేడీ హిల్ల‌రీ క్లింట‌న్ కూడా ప‌ర్పుల్ రంగు దుస్తుల్లో ఈవెంట్‌కు హాజ‌ర‌య్యారు.  ప‌ర్పుల్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకున్న హ్యారిస్‌.. క్రిస్టోఫ‌ర్ జాన్ రోజ‌ర్స్ డిజైన్ చేసిన కోట్‌ను ధ‌రించారు.  2019లో నిర్వ‌హించిన వోగ్ ఫ్యాష‌న్ అవార్డుల్లో ఆ డిజైన‌ర్‌కు అవార్డు ద‌క్కింది. ఊదా రంగుకు ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ది.  క‌మ‌లా హ్యారిస్ ఆ క‌ల‌ర్ డ్రెస్ వేసుకోవ‌డానికి అదే కార‌ణ‌మై ఉంటుంద‌ని కూడా భావిస్తున్నారు. 

రెడ్, బ్లూ క‌లిస్తే.. ప‌ర్పుల్ రంగు వ‌స్తుంది. అయితే డెమోక్ర‌టిక్ పార్టీకి చెందిన నీల రంగుతో పాటు రిప‌బ్లిక‌న్ల‌కు చెందిన ఎరుపు రంగు క‌లిస్తే.. ప‌ర్పుల్ రంగు వచ్చే విధంగా క‌మ‌లా హ్యారిస్ త‌న డ్రెస్సును డిజైన్ చేసిన‌ట్లు తెలుస్తోంది.  అంటే రెండు పార్టీల మ‌ధ్య స‌మ‌న్వ‌యం నెల‌కొల్పేందుకు ఆమె ఆ క‌ల‌ర్ డ్ర‌స్ వేసుకున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. అంతే కాదు, అమెరికాలో ఓటు హ‌క్కు కోసం మ‌హిళ‌లు ఉద్యమం చేసిన స‌మ‌యంలోనూ ప‌ర్పుల్ రంగే అఫీషియ‌ల్ క‌ల‌ర్‌.  దానికి చిహ్నంగా కూడా హ్యారిస్ ఆ క‌ల‌ర్‌ను ఎంపిక చేసి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ప్రమాణ స్వీకార ఈవెంట్‌లో ఫ‌స్ట్ లేడీ జిల్ బైడెన్‌.. బ్లూ కోట్‌ను ధ‌రించారు.    

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close