టాప్ స్టోరీస్సినిమా

ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన ర‌వితేజ‌

డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల విష‌యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఈడీ) ప‌లువురు సెల‌బ్రిటీల‌ను విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్,నందు, రానాల‌ని విచారించిన ఈడీ నేడు ర‌వితేజ‌ను విచారించ‌నుంది. కొద్ది సేప‌టి క్రితం హీరో రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

మనీలాండరింగ్‌, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు. నిన్న రానా, కెల్విన్‌ను కలిపి అధికారులు ప్ర‌శ్నించారు. ఉదయం 10 గంటలకే ఈడీ కార్యాలయానికి చేరుకున్న రానాను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్‌ సరఫరా దారుడు కెల్విన్‌తో సంబంధాలు, ఎఫ్‌ క్లబ్‌లో పార్టీలు, అక్కడ పార్టీలు జరుపుకొనే తీరు, ఎవరెవరు పార్టీలకు హాజరయ్యేవారు?..కెల్విన్‌కు ఎప్పుడైనా డబ్బులు పంపారా?..ఇలా రానాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది.

డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా ఉన్న‌ కెల్విన్‌ని విచారించ‌గా ప‌లువురు సెల‌బ్రిటీల పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కెల్విన్ సెల్‌ఫోన్‌లో ఉన్న ప‌లువురి ఫోన్ నంబ‌ర్లు, వారితో జ‌రిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు ప‌రిశీలించారు. సెప్టెంబ‌ర్‌ 13న నవదీప్‌, ఎఫ్‌క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 17న తనీష్‌, 22న తరుణ్‌ విచారణకు హాజరు కాబోతున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close