సినిమా

రవితేజ ‘రావణాసుర’ నుంచి ఫస్టులుక్ రిలీజ్!

  • రవితేజ మరో కొత్త ప్రాజెక్టు
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న టైటిల్
  • టైటిల్ కి తగిన పోస్టర్  
  • దర్శకుడిగా సుధీర్ వర్మ  

రవితేజ కథానాయకుడిగా సుధీర్ వర్మ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘రావణాసుర’ అనే టైటిల్ ను .. ‘హీరోస్ డోంట్ ఎగ్జిస్ట్’ అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే ఈ సినిమాకి అదే టైటిల్ ను ఖరారు చేశారు. ముందుగా చెప్పినట్టుగానే కొంతసేపటి క్రితం టైటిల్ తో కూడిన ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.

రావణుడి మాదిరిగా పది తలలతో ఈ పోస్టర్లో రవితేజ కనిపిస్తున్నాడు. పుర్రెను పోలిన సింహాసనంపై సూటు బూటు వేసుకుని కూర్చున్నాడు. ఆ సింహాసనం అంతా కూడా రక్త ధారలతో తడిసి ఉంది. న్యాయస్థానానికి సంబంధించిన గ్రంథాలు .. వస్తువులు ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాయి. రవితేజ ఫేస్ లో ఆక్రోశం కనిపిస్తోంది.

ఇంతవరకూ రవితేజ మాస్ కి .. యూత్ కి నచ్చేలా సరదాగా సాగిపోయే కథలనే చేస్తూ వచ్చాడు. కథ ఏదైనా ఆయన మాస్ కామెడీని మిస్ కాలేదు. కానీ ఈ పోస్టర్లో మాత్రం ఆయన అందుకు భిన్నంగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలు పూర్తికాగానే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close