టాప్ స్టోరీస్సినిమా

నేడే రానా మిహీకాల నిశ్చితార్ధం..!

ద‌గ్గుబాటి రానా ఇటీవ‌ల త‌న ట్విట్ట‌ర్ ద్వారా మిహీకా బ‌జాజ్ త‌న ప్రేమ‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.  హైదరాబాద్లో పుట్టి పెరిగిన మిహీక… బంటీ- సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె.   చెల్సియా విశ్వవిద్యాలయం నుండి ఇంటీరియర్ డిజైన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆమె ఇంటీరియర్ డిజైన్ .. డెకార్ బిజినెస్ స్పెషలిస్ట్. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియోను మిహీక స్వయంగా నడుపుతున్నారు.  

రానా త‌నకి కాబోయే శ్రీమ‌తి గురించి ప్ర‌క‌టించిన వెంట‌నే అభిమానులు ఆమె గురించి పూర్తిగా ఆరాలు తీసారు. కొంద‌రు ప్ర‌ముఖులు రానాకి త‌గ్గ జోడి. ఇద్దరు చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్నార‌ని కామెంట్ చేశారు. రానా తండ్రి సురేష్ బాబు.. ఇద్ద‌రు ఒక‌రినొక‌రు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకుంటూ వారి  పెళ్లి ఏర్పాట్లను ప్లాన్‌ చేస్తున్నాం.  సరైన సమయం వచ్చినపుడు ఆ వివరాల్ని వెల్లడిస్తాం అని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

డిసెంబ‌ర్‌లో లేదా కుదిరితే ముందుగానే రానా పెళ్లి జ‌రుపుతామ‌న్న సురేష్ బాబు ఈ రోజు రానా- మిహీకాల నిశ్చితార్ధ వేడుక‌ని కొద్ది మంది స‌మ‌క్షంలో జ‌రుప‌నున్న‌ట్టు తెలుస్తుంది. రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 4గం.ల‌కి ఈ నిశ్చితార్ధ వేడుక జ‌ర‌గ‌నుంది.  ఈ కార్యక్ర‌మానికి కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌వుతార‌ని ఇన్‌సైడ్ టాక్. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close