సినిమా

ఓటీటీలో రానా అర‌ణ్య‌..!

లాక్‌డౌన్ వ‌ల‌న విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్న సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌ష్టాల నుండి కొంత ఉప‌శ‌మ‌నం పొందేందుకు నిర్మాత‌లు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం‌ల‌ని ఆశ్ర‌యిస్తున్నారు. తాజాగా రానా న‌టించిన అర‌ణ్య  చిత్ర నిర్మాత‌లు కూడా సినిమాని ఓటీటీలో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మయ్యార‌ని స‌మాచారం.  ఇప్ప‌టికే ప్ర‌ముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నార‌ని తెలుస్తుంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. 

రానా హీరోగా తెర‌కెక్కిన అర‌ణ్య మూవీ  ఏప్రిల్ 2న విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ,క‌రోనా వ‌ల‌న వాయిదా వేశారు.  మంచి కంటెంట్‌తో త్వ‌ర‌లో మీ ముందుకు వ‌స్తామ‌ని ఈరోస్ సంస్థ తెలిపింది.  రానా ప్ర‌ధాన పాత్ర‌లో  ప్రభు సాల్మన్ తెర‌కెక్కించిన చిత్రం ‘అరణ్య’ .  త్రిభాషా చిత్రం రూపొందిన ఈ మూవీని హిందీలో ‘హాథీ మేరా సాథీ’ పేరుతో ,  తమిళంలో ‘కాదన్’ పేరుతో విడుదల చేయ‌నున్నారు.  చిత్రానికి సంబంధించి విడుద‌లైన టీజ‌ర్‌కి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది.  ఈ చిత్రంలో రానా  అడవిలో ఏనుగులను మచ్చిక చేసుకోని వాటితో సావాసం చేసే అడవి తెగకి చెందిన వ్యక్తిగా క‌నిపించ‌నున్నాడు. జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ , విష్ణు విశాల్ ముఖ్యపాత్రల్లో నటించారు. మానవుల స్వార్థం కోసం అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వలన ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది.   

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close