సినిమా

‘రాములో రాములా..’ ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల‌

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం అల వైకుంఠ‌పుర‌ములో. సినిమా రిలీజ్‌కి ముందే ఈ సినిమా జ‌నాల దృష్టిని ఆక‌ర్షించింది. థ‌మ‌న్ అందించిన బాణీల‌లో ‘సామజవరగమన’, ‘బుట్టబొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. హిట్టైన పాట‌ల‌కి సంబంధించిన వీడియోల‌ని ఒక్కొక్కటిగా విడుద‌ల చేస్తున్న చిత్ర బృందం రీసెంట్‌గా రాములో రాముల పాట ఫుల్ వీడియో సాంగ్ విడుద‌ల చేసింది. తెలంగాణ యాస‌లో సాగిన ఈ సాంగ్ ప్రేక్ష‌కుల‌ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది.  కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగ్లి పాడారు. ఈ సాంగ్‌లో బ‌న్నీ వేసిన స్టెప్స్‌ని దోసె స్టెప్స్ అని అల్లు అర్హ కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close