ఆంధ్రబ్రేకింగ్ న్యూస్

తిరుమల వెంకన్న పరువు వంద కోట్లేనా..? టీటీడీపై రమణదీక్షితులు ఫైర్‌

తిరుమల తిరుపతి దేవస్థానంపై మరోసారి విరుచుకుపడ్డారు ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. పదవి నుంచి తొలగించినప్పటి నుంచి టీడీపీపైనా, చంద్రబాబు ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్న ఆయన, హైదరాబాద్‌లో మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

టీటీడీ విషయంలో తాను చేసిన ఆరోపణలపై పాలకమండలి రూ.100కోట్ల పరువు నష్టం దావా వేసిందని విమర్శించిన రమణ దీక్షితులు.. స్వామి వారి పరువు 100 కోట్లేనా అంటూ అధికారుల తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్న ఆయన, వాటిపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆగమం ప్రకారం శ్రీవారికి అన్ని పూజలు సరిగ్గా జరుగుతున్నాయని నిరూపించడంతో పాటు. .నగలన్నీ భద్రంగానే ఉన్నాయని లెక్క చూపించాల్సిన బాధ్యత కూడా టీటీడీదే అన్నారు.

ప్రశ్నిస్తే పరువు నష్టం దావా వేస్తారా? అంటూ టీడీపీపై ఎదురుదాడికి దిగారు. ఇది ప్రజాస్వామ్యమా.. లేక నిరంకుశత్వమా ? అని ప్రశ్నించారు రమణ దీక్షితులు. తనపై పరువునష్టం దావా వేయాలని ఎవరు సలహా ఇచ్చారో తెలియదన్నారు. తిరువాభరణాలు తరలిపోతున్నాయంటూ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు రమణదీక్షితులు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close