సినిమా

బీరుట్ ఘ‌ట‌న‌పై ఆవేద‌న వ్య‌క్తం చేసిన ర‌కుల్,మ‌హేష్

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని  పోర్టు ప్రాంతంలో  మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్ళకి ప‌రిస‌ర ప్రాంతాల‌న్నీ చెల్లాచెదురు అయ్యాయి. ఈ ప్ర‌మాదంలో వంద‌కి పైగా మ‌ర‌ణించి ఉంటార‌ని, సుమారు 4వేల‌కి పైగా గాయ‌ప‌డి ఉంటార‌ని భావిస్తున్నారు. ఇంత పెద్ద విస్పోట‌నం యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తుపోయేలా చేసింది. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి ర‌కుల్ ప్రీత్ సింగ్‌, త‌మ‌న్నా ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి సంతాపం తెలిపారు. కుటుంబ స‌భ్యుల‌కి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

బీరుట్ ఘ‌ట‌న హృద‌య‌విదార‌కంగా మారింది. 2020లో ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్నో జ‌రిగాయి. ఇక చాలు.  బీరుట్ ప్ర‌మాద భాధితులకి గుండె ధైర్యాన్ని అందించాల‌ని దేవుడిని ప్రార్ధిస్తున్నాను అని ర‌కుల్ ట్వీట్ చేసింది.  త‌మన్నా కూడా త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి సంతాపం తెలిపింది.

బీరుట్ ఘ‌ట‌న ఎంత‌గానో క‌లిచి వేసింది. ఈ దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కి వారి కుటుంబ నా స‌భ్యుల‌కి నా ప్రార్ధ‌న‌లు అని మ‌హేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఓడరేవు వద్ద ఓ గిడ్డంగిలో నిల్వ చేసిన  2,700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close