జాతీయం

హోమియోప‌తి బిల్లుకు రాజ్య‌స‌భ ఆమోదం

హోమియోప‌తి సెంట్ర‌ల్ కౌన్సిల్ (స‌వ‌ర‌ణ‌) బిల్లుకు ఇవాళ రాజ్య‌స‌భ ఆమోదం తెలిపింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.  2019 జూన్‌లో లోక్‌స‌భ‌లో హోమియోప‌తి బిల్లు పాసైంది.  బిల్లు సంద‌ర్భంగా స‌భ్యులు మాట్లాడుతూ.. ఆర్డినెన్స్ రాజ్యం చెలామ‌ణి అవుతోంద‌ని ఎంపీ కేకే రాజేశ్ త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వ్య‌వ‌స్థ‌లు, సంస్థ‌ల అటాన‌మీని ప్ర‌భుత్వం లాక్కుంటోంద‌ని ఎంపీ బిపిన్ బోరో ఆరోపించారు. హోమియోప‌తి బోధ‌న నాణ్య‌త‌, ప్రాక్టీసింగ్‌పై ప్ర‌భుత్వం ముందు స‌వాళ్లు ఉన్న‌ట్లు బీజేపీ ఎంపీ డాక్ట‌ర్ సుధాన్షు త్రివేది తెలిపారు. హోమియోప‌తి చికిత్స‌కు శాస్త్రీయ ఆధారం లేద‌ని కొంద‌రంటార‌ని, కేవ‌లం వ్యాధిపై మాత్ర‌మే కాదు, రోగిపైన కూడా హోమియో వైద్యం దృష్టిపెడుతుంద‌న్నారు. దీని వెనుక ఉన్న సైన్స్ క‌నిపించ‌ద‌ని ఎంపీ సుధాన్షు తెలిపారు.

ప్ర‌భుత్వ‌మా.. ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీనా ?

బెంగాల్‌కు చెందిన ఎంపీ డాక్ట‌ర్ స‌నాత‌న్‌ సేన్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ వైఖ‌రిని ఖండించారు. గోమూత్రం తాగితే వ్యాధులు న‌యం అవుతాయ‌ని ప్ర‌భుత్వమే చెబుతుంటే.. ఇక ఆ ప్ర‌భుత్వం నుంచి ఏం ఆశించ‌గ‌ల‌మ‌ని అన్నారు. అర్హ‌త లేని వైద్య విధానాల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తున్న‌ద‌ని ఆరోపించారు. ప్రైవేటు కాలేజీల‌కు కూడా అక్ర‌మ అనుమ‌తులు ఇస్తున్న‌ట్లు ఆరోపించారు. భార‌తీయ వైద్య విధానంలో హోమియోప‌తి పురాత‌న ప‌ద్ధ‌తి అని, ఇది పేదల‌కు అందుబాటులో ఉంటుంద‌ని, ఈ చికిత్సా విధానాన్ని మ‌రింత క్రియాశీలంగా మార్చాల‌ని బీజేపీ ఎంపీ ప్ర‌స‌న్న ఆచార్య తెలిపారు. 

ఫెడ‌ర‌ల్ స్పూర్తిని విఘాత ప‌రిచే విధంగా బిల్లు ఉన్న‌ట్లు డీఎంకే ఎంపీ తిరుచి శివ ఆరోపించారు. అడ్వైజ‌రీ కౌన్సిల్‌లో స్టేట్ మెడిక‌ల్ కౌన్సిల్స్ స‌భ్యుల ప్రాతినిధ్యం లేద‌న్నారు. ఆర్డినెన్స్ విధానంలో బిల్లును తీసుకురావ‌డాన్ని ఆర్జేడీ ఎంపీ ప్రొఫెస‌ర్ మ‌నోజ్ కుమార్ తెలిపారు. ఇది ప్ర‌భుత్వం కాదు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటూ ఆయ‌న ఆరోపించారు.  బిల్లును బ్యాలెన్స్ చేయాల‌ని, స‌హ‌కార స‌మాఖ్య గురించి ప్ర‌ధాని మాట్లాడుతున్నా.. కానీ కార్యాచ‌ర‌ణ అలా లేద‌న్నారు. భార‌తీయ మెడిసిన్ అంటూ మార్కెట్లో అనేక న‌కిలీ మందులు అమ్ముతున్నార‌ని, ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని కోరారు. 

క‌ర్నాట‌క‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ఎల్ హ‌నుమంత‌య్య ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. ఆర్డినెన్స్ ప్ర‌భుత్వం అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. పార్ల‌మెంట్ జ‌రుగుతున్న‌ప్పుడు ఇన్ని ర‌కాల ఆర్డినెన్స్‌లు ఎందుకు అని ఆయ‌న ప్ర‌శ్నించారు. అసంబ‌ద్ధ ప‌ద్ధ‌తిలో బిల్లులు తీసుకువ‌స్తున్న‌ట్లు ఓ స‌భ్యుడు చేసిన ఆరోప‌ణ‌న‌ను ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఖండించారు. మూజువాణి ఓటు ద్వారా హోమియోప‌తి బిల్లును పాస్ చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close