జాతీయంటాప్ స్టోరీస్సినిమా

పిల్లాడి నిజాయితీకి ముగ్ధుడైన రజినీకాంత్

సమాజ సేవతో ఎన్నో గుప్తదానాలు చేసిన  సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ చిన్నారి నిజాయితీని చూసి ముగ్ధుడైయ్యారు. తనను చూడాలన్న ఆ చిన్నారి ఆకాంక్షను రజినీ నెరవేర్చి అతడిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. తమిళునాడులోని ఈరోడుకు చెందిన రెండో తరగతి విద్యార్థి మహ్మద్ యాసిన్(7) ఇటీవల రోడ్డుపై తనకి దొరికిన రూ.50 వేల నగదును పాఠశాల ఉపాధ్యాయుడి ద్వారా నగర పోలీసు కమిషనర్‌కు అందజేశాడు. దీంతో అక్కడున్నవారందరూ ఆ చిన్నారిని మెచ్చుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న రజినీ పీపుల్ ఫోరం నిర్వాహాకులు అభినందించడంతో పాటు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే దీనికి ఆ చిన్నారి నిరాకరించాడు. తనకు రజినీకాంత్ అంటే చాలా ఇష్టమని, ఆయకు వీరాభిమానినని, ఆయన్ను కలవాలని ఉందంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. దీని గురించి నిర్వాహకుల ద్వారా రజనీకాంత్‌ తెలియడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.

దీంతో చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని రజనీకాంత్‌ నివాసానికి మహ్మద్‌ యాసిన్‌ను ఆదివారం ఉదయం రజనీ పీపుల్‌ ఫోరం నిర్వాహకులు తీసుకెళ్లారు. ఆ బాలుడిని రజనీ తన ఒడిలో కూర్చొబెట్టుకున్నారు. పిన్న వయస్సులోనే నిజాయతీ చాటుకున్న అతడిని అభినందిస్తూ బంగారు గొలుసు బహూకరించారు. ఆ బాలుడి చదువుకు అయ్యే ఖర్చును భరించనున్నానని తెలిపారు. అతడు ఆసక్తి చూపిన కోర్సులు చదివిస్తానని మీడియా ప్రతినిధుల సమక్షంలో రజనీకాంత్‌ హామీ ఇచ్చారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close