రాజకీయం

రాహుల్‌గాంధీకి ఉల్లిగ‌డ్డ ఎలా పెరుగుతుందో కూడా తెలియ‌దు -శివ‌రాజ్‌సింగ్‌

భోపాల్: ‌కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత రాహుల్‌గాంధీకి ఉల్లిగ‌డ్డ భూమి లోప‌ల పెరుగుత‌దో, బ‌య‌ట పెరుగుత‌దో తెలియ‌ద‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు శివ‌రాజ్‌సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ ట్రాక్ట‌ర్ల‌పైన తిరుగుతూ, సోఫాల‌పైన కూర్చుంటూ వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని, ఆయ‌నకు వ్య‌వ‌సాయం గురించి ఏమీ తెలియ‌ద‌ని విమ‌ర్శించారు. ఆఖ‌రికి ఉల్లిపంట‌లో ఉల్లిగ‌డ్డ నేల లోప‌ల పెరుగుతుందో బ‌య‌ట పెరుగుతుందో కూడా ఆయ‌నకు అవ‌గాహ‌న లేద‌ని హేళ‌న చేశారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల చేసిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఖేతీ బ‌చావో యాత్ర పేరుతో ర్యాలీలు నిర్వ‌హించారు. ఈ ర్యాలీలు, నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో పాల్గొన్న రాహుల్‌గాంధీ కేంద్ర‌ప్ర‌భుత్వంపైన‌, ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపైన‌, అధికార బీజేపీపైన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో శివ‌రాజ్‌సింగ్ రాహుల్‌గాంధీని హేళ‌న చేస్తూ మాట్లాడారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close