అంతర్జాతీయం

మనుమడి నిర్ణయానికి ఎలిజిబెత్‌ ఆమోదం

లండన్‌: ఆర్థికంగా స్వతంత్రంగా జీవిస్తామన్న తన మనుమడి(ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మెర్కెల్‌ దంపతులు) నిర్ణయానికి బ్రిటన్‌ మహారాణి ఎలిజిబెత్‌ (93) ఆమోదం తెలిపారు. రాజ కుటుంబం నుంచి తాము వేరుపడి.. బ్రిటన్‌తో పాటు అమెరికాలో స్వతంత్రంగా ఉంటామని ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ మెర్కెల్‌ దంపతులు ఇటీవల ప్రకటించడం సంచలనాన్ని సృష్టించడం తెలిసిందే. ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలనుకోవడంతో పాటు తాము రాజకుటుంబంలో సీనియర్‌ సభ్యులుగా కొనసాగబోమని వాళ్లు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రిన్స్‌ హ్యారీతో పాటు, రాజకుటుంబానికి చెందిన సీనియర్‌ సభ్యులతో నార్‌ఫోల్క్‌లోని శాండ్రింగావ్‌ు ఎస్టేట్‌లో సోమవారం నిర్మాణాత్మక ముఖాముఖి భేటీ జరిగింది. ప్రిన్స్‌ హ్యారీ నిర్ణయాన్ని ఎలిజిబెత్‌ ఆమోదించారని ఎలిజిబెత్‌ పేరిట విడుదలైన ఓ ప్రకటనలో బకింగ్‌హవ్‌ు ప్యాలెస్‌ పేర్కొంది. ప్రిన్స్‌ హ్యారీ-మేఘన్‌ల నిర్ణయానికి సానుకూలంగా స్పందిస్తూ.. వారి ‘పరివర్తనదశ’ను అంగీకరిస్తున్నట్టు పేర్కొంది. హ్యారీ-మేఘన్‌ దంపతులు తీసుకున్న నిర్ణయానికి రాజకుటుంబానికి చెందిన సీనియర్‌ సభ్యులు కూడా మద్దతు ప్రకటించినట్టు ప్రకటన తెలిపింది. అయితే, రాజకుటుంబంలో హ్యారీ-మేఘన్‌ మెర్కెల్‌ సభ్యులుగా కొనసాగుతారని ఆ ప్రకటన స్పష్టం చేసింది. మరోవైపు రాజ కుటుంబంలో విభేదాలు అంటూ వచ్చిన వార్తలను ప్రిన్స్‌ హ్యారీ, ప్రిన్స్‌ విలియవ్‌ ఖండించారు.

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close