రాజకీయం

‘పెద్ద నోట్ల రద్దు’కు నేటితో ఐదేళ్లు.. కేంద్రంపై మండిపడ్డ ప్రియాంకాగాంధీ

  • 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన మోదీ ప్రభుత్వం
  • నోట్ల రద్దు ఒక పెద్ద డిజాస్టర్ అన్న ప్రియాంక
  • అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట ఎందుకు పడలేదని ప్రశ్న 

నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తయింది. 2016 నవంబర్ 8న పెద్దనోట్లను రద్దు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

నోట్ల రద్దు ఒక పెద్ద డిజాస్టర్ అని ఆమె అన్నారు. నోట్ల రద్దు తర్వాత కూడా అవినీతి, నల్లధనానికి అడ్డుకట్ట ఎందుకు పడలేదని ప్రశ్నించారు. నోట్ల రద్దు నిర్ణయం విజయవంతమయినట్టయితే… అవినీతి ఇంకా ఎందుకు కొనసాగుతోందని అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ క్యాష్ లెస్ ఎందుకు కాలేదని ప్రశ్నించారు. టెర్రరిజం ఎందుకు తగ్గలేదని అడిగారు. ధరలు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయని అన్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై వామపక్షాలు కూడా మండిపడ్డాయి. ఐదేళ్లు గడుస్తున్నా నల్లధనాన్ని కేంద్రం పట్టుకోలేకపోయిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను సర్వ నాశనం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close