సినిమా

అస్సాం వ‌ర‌దలు: సాయం అందించిన ప్రియాంక‌, నిక్

ప్ర‌స్తుతం ప్రపంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో అత‌లాకుత‌లం అవుతుంటే అస్సాంని వ‌ర‌ద‌లు కోలుకోనీయ‌కుండా చేస్తున్నాయి. భారీ వర్షాల‌తో వ‌ర‌ద‌లు విలయం సృష్టించాయి.  పలు గ్రామాలు నీట మునగడంతో ప్రాణ, ఆస్తినష్టం భారీగా సంభవించింది. బ్రహ్మపుత్రా నదికి వరద పోటెత్తడంతో కాజీరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం 80 శాతం నీట మునిగి మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించి ప్రియాంక‌, నిక్ దంప‌తులు విరాళాన్ని అందించేందుకు ముందుకు వ‌చ్చారు.

అస్సాం పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది.  వ‌ర‌ద‌ల వ‌ల‌న ల‌క్ష‌ల మంది జీవితాలు రోడ్డున ప‌డ్డాయి. ప్రాణ‌, ఆస్తిన‌ష్టం గురించి ఊహించ‌లేము. వరద పోటెత్తడంతో కాజీరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా మునిగిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో వారికి మ‌న మ‌ద్ద‌తు అవ‌స‌రం. అస్సాంలో ప‌నిచేస్తున్న కొన్ని సంస్థ‌ల‌కి మేము విరాళాలు అందించాం. వారు మీ అవ‌స‌ర‌మైన సాయం చేస్తారు అని ప్రియాంక పేర్కొంది. ఆప‌త్కాలంలో ప్రియాంక దంప‌తులు చూపించే దాతృత్వం అద్భుతం అని నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close