సినిమా

జాంబీ రెడ్డి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌.. ప్ర‌భాస్ చేతుల మీదుగా విడుద‌ల‌

అ! సినిమాతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ జాంబీ రెడ్డి అనే సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో  రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులో రూపొందుతున్న తొలి సినిమా అని మేక‌ర్స్ అంటున్నారు. ఇంద్ర’ చిత్రంలో చిన్న‌ప్ప‌టి చిరంజీవిగా న‌టించడంతో పాటు ప‌లు చిత్రాల్లో బాల న‌టుడిగా న‌టించిన తేజ స‌జ్జ జాంబీ రెడ్డి చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. దక్ష‌, ఆనంది క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు.

 హారర్‌, థ్రిల్లింగ్‌, గ్రాఫిక్స్‌ అంశాలతో నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల టీజ‌ర్ విడుద‌ల చేశారు. స‌మంత చేతుల మీదుగా విడుదలైన టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక న్యూయ‌ర్ గిఫ్ట్‌గా జ‌న‌వ‌రి 2న ప్ర‌భాస్ చేతుల మీదుగా బిగ్ బైట్ అంటూ ఓ స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్నారు మేక‌ర్స్ . తాజాగా దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు. ప్రేక్షకుల ఊహకందని వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం  అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని అంటున్నారు చిత్ర నిర్మాత‌లు. ప్ర‌భాస్ వంటి పాన్ ఇండియ‌న్ స్టార్ ఈ సినిమాకు స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో చిత్రంకు మంచి క్రేజ్ రావ‌డం ఖాయం. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close