బిజినెస్

పర్సనల్‌ ఫైనాన్స్‌ ఎస్-బ్యాంక్ ఫౌండర్ అరెస్ట్..

ఎస్ బ్యాంక్‌ ఫౌండర్‌ రానా కపూర్‌ని ఈడీ అరెస్ట్‌ చేసింది. 15 గంటల పాటు రానాని విచారించిన ఈడీ ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకుంది. 2 లక్షల కోట్ల డిపాజిట్లతో 1100 బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఎస్ బ్యాంక్ కొంతకాలంగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఆస్తుల విలువ పతనమైన అప్పులు గుదిబండగా మారడంతో చివరకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఎస్ బ్యాంక్‌పై మారటోరియం కూడా విధించింది. కాగా, ఎస్ బ్యాంకు సీఈవో రాణాకపూర్ ఇంట్లో ఈడీ అధికారులు శనివారం ఉదయం నుండి సోదాలు నిర్వహించారు.. రాణాకపూర్ పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మరోవైపు, ఖాతాదారులు నెలకు రూ.50 వేలు మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్‌కు అనుమతినిచ్చింది ఆర్బీఐ. సెంట్రల్‌ బ్యాంక్‌.. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఇక, బ్యాంకు బోర్డును కూడా రద్దు చేశారు. అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్బీఐ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. బ్యాంకుకు విశ్వసనీయమైన పునర్జీవ ప్రణాళిక అంటూ ఏదీ లేక పోవడంతో ప్రజా ప్రయోజనాలు, బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎస్ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. మీ సొమ్ము భద్రం అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close