క్రైమ్

సినీ నటి పూనమ్‌ పాండేను తీవ్రంగా కొట్టిన భ‌ర్త‌.. తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలు

  • ఆసుప‌త్రిలో చికిత్స‌
  • పోలీసుల‌కు ఫిర్యాదు
  • భ‌ర్త అరెస్టు.. ద‌ర్యాప్తు షురూ
  • ప‌దే ప‌దే కొడ‌తాడ‌ని చెప్పిన పూన‌మ్\

బాలీవుడ్‌ నటి, మోడల్ పూనమ్‌ పాండేపై ఆమె భర్త సామ్‌ బాంబే శారీరక హింసకు పాల్పడ్డాడు. భ‌ర్త తీవ్రంగా కొట్ట‌డంతో ప్ర‌స్తుతం ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలో త‌న భ‌ర్త‌పై పూన‌మ్ కేసు పెట్ట‌డంతో అత‌డిని పోలీసులు అరెస్టు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

రెండేళ్లు సామ్ బాంబేతో పూన‌మ్ సహజీవనం చేసి, గత ఏడాది సెప్టెంబరు 1న అత‌డిని పెళ్లి చేసుకుంది. అప్ప‌టి నుంచి ఆమెకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. భ‌ర్త త‌న‌పై దాడి చేయడంతో ఆమె గృహహింస కేసు పెట్టింది. కౌన్సెలింగ్‌లో ఆమెకు క్షమాపణలు చెప్పిన సామ్ బాంబే రాజీ కుదుర్చుకున్నాడు.

అప్పటినుంచీ మ‌ళ్లీ వారిద్ద‌రూ క‌లిసి వుంటున్నారు. తర్వాత కొన్నాళ్లకే సామ్ బాంబే మ‌ళ్లీ త‌న బుద్ధిని చూపించాడు. అతను తన మొదటి భార్య అల్విరాతో మాట్లాడుతుండడంతో అత‌డిని పూన‌మ్ నిల‌దీసింది. దీంతో ఆమెను భర్త తీవ్రంగా కొట్టాడు. ఆమె జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టడంతో ఆమె తల, కళ్లు, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుప‌త్రిలో చేరి కేసు పెట్టింది.

ఈ దాడి త‌న‌పై మొదటి సారి జరిగింది కాదని, త‌న భ‌ర్త త‌న‌ను తరచూ కొడుతూనే ఉంటాడ‌ని, ఆ తర్వాత ఏడుస్తూ క్షమాపణలు చెబుతుంటాడ‌ని ఆమె తెలిపింది. అత‌డి ఏడుపు చూసి తాను క‌రిగిపోయి క్ష‌మించేదాన్న‌ని చెప్పింది. ఈ సారి మ‌రీ రెచ్చిపోయి విప‌రీతంగా కొట్టాడ‌ని తెలిపింది. ఇప్పుడు ఎన్ని రోజులు ఆసుప‌త్రిలో ఉండాల్సి వస్తుందో త‌నకే తెలియట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close