జాతీయంటాప్ స్టోరీస్బ్రేకింగ్ న్యూస్రాజకీయం

తమిళనాట శవ రాజకీయం

డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో రాష్ట్రంలో శవ రాజకీయం మొదలయ్యింది. తమిళ రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తులుగా భావించే అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలితల సమాధులు ఉన్న మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు స్థలం కేటాయించడానికి ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం నిరాకరించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది డీఎంకే పార్టీ. మెరీనా బీచ్‌లోనే కరుణానిధి అంత్యక్రియలకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది.

అన్నాదురై వారసుడిగా డీఎంకే పగ్గాలు చేపట్టిన కరుణానిధికి ఆయన సమాధి పక్కనే స్థలం కేటాయించాలని డీఎంకే డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం గిండిలో కరుణానిధికి రెండెకరాలు కేటాయించింది.

దీనిపై ఆసక్తికరమైన వాదనలు జరిగాయి. చివరకు తమిళనాడుకు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన కరుణానిధికి మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం సబబుగానే ఉంటుందని కోర్టు తీర్పు చెప్పడంతో డీఎంకే కార్యకర్తలకు ఊరట కలిగింది.

మెరీనా బీచే ఎందుకు?

అన్నాదురై సమాధి

చెన్నైలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతం మెరీనా బీచ్‌. నిత్యం వేలాది మంది బీచ్‌ను సందర్శిస్తారు. పనిలో పనిగా అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలితల సమాధులను కూడా దర్శించుకుంటారు.

ఎంజీఆర్ సమాధి

ఇక్కడే కరుణానిధి సమాధిని నిర్మిస్తే ఆయన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కరుణానిధి ప్రభావం తమిళ వాసులపై తగ్గకుండా ఉండగలుగుతుంది. ఎంజీఆర్‌, జయలలిత ఇద్దరూ అన్నాడీఎంకే నేతలే కాబట్టి, డీఎంకేకు చెందిన కరుణానిధికీ అక్కడ సమాధి ఉండాల్సిందేనని భావిస్తున్నారు ఆయన తనయుడు స్టాలిన్.

జయలలిత సమాధి

 

ప్రభుత్వ వాదన ఏంటి?

అధికారంలో ఉన్న అన్నాడీఎంకేకు, ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే బద్ధ శత్రువులు. పైగా జయలలితకు, కరుణ వాసనంటేనే పడదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అసెంబ్లీలోకి కూడా జయలలిత అడుగుపెట్టలేదు. అలాంటింది జయలలిత సమాధి ఉన్న చోటే కరుణానిధికి స్థలం కేటాయించే ప్రసక్తే లేదని భీష్మించుకుంది అన్నాడీఎంకే ప్రభుత్వం. దీనికి గతంలో కారణాలను సాకుగా చూపిస్తోంది. కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే చూపిస్తూ, మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడానికి నిరాకరిస్తోంది.

గతంలో కరుణ చేసిందేమిటి?
అన్నాదురై, ఎంజీఆర్‌, జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రులుగా పదవిలో ఉండగానే కన్నుమూశారు. అందుకే వారికి మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించామంటోంది ప్రభుత్వం. గతంలో మాజీ ముఖ్యమంత్రులు కామరాజ్‌ నాడార్‌,ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ చనిపోయినప్పుడు మెరీనా బీచ్‌లో స్థలం ఇవ్వడానికి కరుణానిధి నిరాకరించారు. చట్టాలు అనుమతించవని తేల్చి చెప్పారు. దీంతో మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి ఉన్నప్పటికీ, ఆయన భార్యకు మాత్రం మరో ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.

READ: ఒకే ఒక్కడు కరుణానిధి

కోర్టు తీర్పుతో మాత్రం కరుణానిధికి అన్నాదురై సమాధి పక్కనే అంత్యక్రియలకు స్థలం లభించింది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close