ఆంధ్రరాజకీయం
Trending

అయ్యన్న అరెస్ట్ కి రంగం సిద్ధం !

అయ్యన్న రాముడై తే..లక్ష్మణుడి గా  సన్యాసి పాత్రుడు అని నిన్నటి వరకు టీడీపీ నేతలు జేజేలు పలికారు. ఇపుడు అదే తమ్ముడు లక్ష్మణుడు కాడు… విభీషణుడై పోయాడని టీడీపీ నేతలు సన్యాసి పాత్రుడు  ఆక్రోశం వెళ్ళ గక్కుతున్నారు. రాజకీయం లో తమ పార్టీ లో ఉన్నప్పుడు ఒకలా మరో పార్టీ లో జాయిన్ కాగానే మరోలా మాట్లాడటం పరిపాటే.  నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు అతని సోదరుడు సన్యాసి పాత్రుడు ఒకే భవనం లో నివాసం ఉంటున్నారు. సన్యాసి పాత్రుడు ఇటీవల తన రాజకీయ భవిష్యత్ కోసం  వైసీపీ లో జాయిన్ కావడం తో ఇరు కుటుంబాల మధ్య  దూరం పెరిగింది.

ఇదే సమయం లో ఈ నెల 12వ తేదీన సన్యాసిపాత్రుడు తాను ఉంటున్న భవనంపై వైసీపీ జెండా కట్టడం తో వివాదం ఏర్పడింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లారు. అనుమతి లేకుండా పోలీసులు ఎలా వస్తారంటూ అయ్యన్న నిలదీశారు. అయితే అయ్యన్నపాత్రుడు తమ విధులకు ఆటంకం కలిగించారని తమను దూషించారని నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం సొంత పని మీద కుటుంబం తో వేరే ప్రాంతానికి వెళ్లారు. ఆయన లేని సమయంలో కేసు నమోదు చేయడం పార్టీ వర్గాల్లో ఈ వ్యహవరం పై జోరుగా చర్చ జరుగుతుంది. పైగా ఆయన్ను అరెస్టు చేస్తారంటూ శనివారం రాత్రి నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇక అయ్యన్న కొడుకు ఆయన రాజకీయ వారసుడు విజయ్ పాత్రుడు అయితే తన తండ్రి మీద అధికారం ఉంది కదా అని వైసీపీ నేతలు కేసులు పెడుతున్నారని పోలీసులను అడ్డుపెట్టుకుని అణగదొక్కాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే పోలీసు వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతానికి అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేయడం లేదని దర్యాప్తు అనంతరం నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. అయ్యన్న పై కేసు నమోదు అయినట్టు తెలియడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు ఆదివారం అయ్యన్న ఇంటికి వెళ్లి ఆయన కుమారుడు విజయ్ తో సమావేశ మయ్యారు. అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యం లోనే అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి మరి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close