క్రైమ్

దుకాణం ముందు బాలిక మృతదేహం కేసు.. తీవ్రంగా కొట్టి చంపేసిన‌ట్లు పోలీసుల నిర్ధార‌ణ‌

  • పంజాగుట్టలో ఇటీవ‌ల విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ్డ‌ నాలుగేళ్ల బాలిక
  • మృత‌దేహాన్ని ఓ మ‌హిళ వ‌దిలి వెళ్లిన‌ట్లు గుర్తింపు
  • నిందితుల గాలింపున‌కు 4 పోలీసు, 3 టాస్క్‌ఫోర్స్ బృందాల‌ ఏర్పాటు

హైద‌రాబాద్‌లోని పంజాగుట్టలో నాలుగేళ్ల బాలిక ఇటీవ‌ల విగ‌త‌జీవిగా క‌న‌ప‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. ద్వారకాపురి కాలనీలోని మూసి ఉన్న దుకాణం ఎదుట ఉద‌యాన్నే ఆ బాలిక మృత‌దేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అనుమానాస్ప‌ద మృతిగా కేసు న‌మోదు చేసుకుని  ద‌ర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఆ బాలిక పోస్టు మార్టం రిపోర్టు వ‌చ్చింది. దాని ద్వారా ఆ బాలిక‌ది హ‌త్యేన‌ని పోలీసులు తెలిపారు.

ఆ బాలిక‌ను ఎవ‌రో తీవ్రంగా కొట్టార‌ని తేల్చారు. ఆమె క‌డుపులో ఎవ‌రో బ‌లంగా త‌న్నిన‌ట్లు చెప్పారు. ఆ బాలిక మృత‌దేహాన్ని దుకాణం ముందు ఓ మ‌హిళ వ‌దిలి వెళ్లింద‌ని తెలిపారు. సీసీటీవీ కెమెరాలో నిందితుల‌ను గుర్తించామ‌ని, వారి కోసం గాలిస్తున్నామ‌ని వివ‌రించారు. నిందితుల కోసం నాలుగు పోలీసు, మూడు టాస్క్‌ఫోర్స్ బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close