జాతీయంటాప్ స్టోరీస్

వీడియో..యువతులపై పోలీసులు అరాచకం

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అలహాబాద్‌ పర్యటన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు రెచ్చిపోయారు. షా కాన్వాయ్‌ను అడ్డుకుని నల్ల జెండాలు ప్రదర్శించిన ఇద్దరు యువతుల్ని పక్కకు లాకెళ్లిన పోలీసులు లాఠీతో కొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ రోజు ర్యాలీలో పాల్గొనేందుకు నగరానికి చేరుకున్న అమిత్ షా కాన్వాయ్‌ ను అలహాబాద్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు యువతులు, ఓ యువకుడు అడ్డుకున్నారు.

అనంతరం నల్లజెండాలను ప్రదర్శించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు వారిని పక్కకు ఈడ్చిపడేశారు. ఈ సందర్భంగా యువతుల్నిజీపులోకి ఎక్కిస్తుండగా..ఓ పోలీసు అధికారి లాఠీతో ఒకామెను లాగిపెట్టి కొట్టాడు. ఇంకో యువతి పోలీసులు జుట్టు పట్టి లాగి జీపులోకి తొశారు. దీంతో అక్కడే ఉన్న మరో అధికారి విద్యార్థుల్ని కొట్టవద్దని తన సహచరుల్ని వారించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అమిత్‌ షా కాన్వాయ్ ను అడ్డుకున్న నేహా యాదవ్‌, రామా యాదవ్, కిషన్ మౌర్యలు సమాజ్‌ వాదీ పార్టీ విద్యార్థి విభాగం సమాజ్‌ వాదీ ఛాత్ర్‌ సభకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close