జాతీయంటాప్ స్టోరీస్రాజకీయం

పోలవరం మోడీ వరం..బాబుది కాదు

పోలవరం ప్రాజెక్ట్ మోడీ వరం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహీరావు అన్నారు. రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ఇంతవరకు 6,700కోట్ల రూపాయిల మేర ఇంతవరకు నిధులు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం ఇదంతా తమ కృషి అని ప్రచారం చేసుకుంటోందని అయన ఎద్దేవ చేశారు.

ఇది జాతీయ ప్రాజెక్టుగా మోడీ అభివృద్ది చేస్తున్నారని ఆయన అన్నారు. సాగరమాల ప్రాజెక్టు కింద 1,63 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీని కింద ఏపీకి ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అన్నారు. పీఎం ఆవాస యోజన కింద ఏడు లక్షల ఇళ్లు ఇచ్చారని, వెంకయ్య నాయుడు మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చారని ఆయన అన్నారు. ఈ ఇళ్లకు రాష్ట్రం అధికంగా డబ్బు వసూలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close