జాతీయంటాప్ స్టోరీస్

రామ్‌విలాస్ పాశ్వాన్ పార్ధివ‌దేహానికి ప్ర‌ధాని మోదీ నివాళి

కేంద్ర ఆహార‌, ప్ర‌జా పంపిణీ శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌.. గురువారం రాత్రి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఉద‌యం ఢిల్లీలో ప్ర‌ధాని మోదీ ఆయ‌న మృతి ప‌ట్ల నివాళి అర్పించారు.  కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లిన ప్ర‌ధాని.. పాశ్వాన్ పార్దీవ‌దేహంపై పుష్ప‌గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.  కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను ఓదార్చారు.  పాశ్వాన్ కుటుంబ‌స‌భ్యుల‌తో ప్ర‌ధాని మోదీ మాట్లాడారు. బీహార్‌కు చెందిన ద‌ళిత నేత‌గా రామ్‌విలాస్ ఎన‌లేని కీర్తిని గ‌డించారు.  లోక్‌జ‌న‌శ‌క్తి పార్టీని స్థాపించిన ఆయ‌న‌.. ఎనిమిది సార్లు లోక్‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉన్నారు. గ‌త కొన్ని వారాల నుంచి హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతున్న పాశ్వాన్ ఇటీవ‌ల గుండె ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. 

1990 ద‌శ‌కంలో దేశ‌వ్యాప్తంగా మండ‌ల్ క‌మిష‌న్ అమ‌లు చేయ‌డంలో రామ్‌విలాస్ పాశ్వాన్ కీల‌క పాత్ర పోషించారు.పాశ్వాన్‌ను కోల్పోవ‌డం వ్య‌క్తిగ‌తంగా త‌న‌కు న‌ష్ట‌మే అని, తానో మిత్రుడిని కోల్పోయిన‌ట్లు ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.  క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డం, అకుంఠిత దీక్ష‌తో రాజ‌కీయాల్లో రామ్‌విలాస్ రాణించార‌ని మోదీ గుర్తు చేశారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో యువ నేత‌గా ఆయ‌న అప్ప‌టి ప్ర‌భుత్వాన్ని ఎదురించార‌న్నారు. 1969లో తొలిసారి ఆయ‌న సంయుక్త సోష‌లిస్టు పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యే అయ్యారు. హ‌జీపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న రికార్డు స్థాయిలో గెలుపొందారు.  అత్య‌ధిక తేడా ఓట్ల‌తోనూ పాశ్వాన్ రికార్డు క్రియేట్ చేశారు. వివిధ పార్టీ నేత‌ల‌తో ఆయ‌న మంచి సంబంధాల‌ను పెంచుకున్నారు.   జ‌న‌తాద‌ళ్‌, కాంగ్రెస్‌, బీజేపీ ప్ర‌భుత్వాల్లో ఆయ‌న కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close