అంతర్జాతీయంటాప్ స్టోరీస్

విమానం కూలే మందు ఎలా ఉంటుందో చూశారా..!

విమానం కూలే ముందు భయం ఎలా ఉంటుందో ఈ వీడియో చూపిస్తుంది. వండర్‌బూమ్‌ ఎయిర్ పోర్టు నుంచి నెదర్లాండ్‌కు వెళుతున్న ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటన దక్షణాఫ్రికా కేప్‌టౌన్‌ వద్ద జరిగింది. ఫైలెట్‌, కో ఫైలెట్‌ సహా మొత్తం 19 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. 1954లో  తయారు చేసిన విమానాన్ని నెదర్లాండ్‌లోని మ్యూజియంకు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఒక ఇంజినీయర్, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా వుంటే ప్రమాదానికి ముందు అందులోని వ్యక్తి విమానం రెక్కలను వీడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో రెక్కకు కొంచెం కొంచెంగా మంటలు వ్యాపించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆ వీడియో ఆగిపోయింది. ఆ సమయంలోనే ప్రమాదం జరిగిందని అర్థమవుతుంది. ప్రమాదంలో  చిక్కుకున్న ప్రయాణికులు ఆర్తనాదాలు స్పష్టంగా రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close