ధూపంతో దూరం

- ఐసొలేషన్తోనే కరోనా నివారణ
- భౌతికదూరం పాటించాల్సిందే
ఆయుర్వేద ధూపంతో కరోనా వైరస్‌కు దూరంగా ఉండవచ్చని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సులోచన అరిగె చెప్పారు. భౌతికదూరం పాటించడంతోపాటు కొన్ని ఆయుర్వేద పద్ధతులు పాటిస్తే మహమ్మారిని తరిమికొట్టవచ్చన్నారు. కరోనాతోపాటు ఇతర వైరస్లు, రోగాల బారిన పడకుండా ఆయుర్వేదంలో అనేక ప్రక్రియలు ఉన్నాయని చెప్పారు. స్పర్శ ద్వారా, ఒకరి ఉచ్ఛాసనిశ్వాసాల ద్వారా, ఒకరువాడిన వస్తువులు మరొకరు వాడటం ద్వారా రోగాలు వ్యాపిస్తాయని ఆచార్య సుశృతుడు కూడా చెప్పారని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌లోనే కాదు.. నిత్యం అనుసరించాల్సిన జాగ్రత్తలను సూచించారు. గ్రంథాల్లో పేర్కొ న్న, ప్రాక్టికల్‌గా అనుసరణీయమైన అంశాలను ఆమె ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు.
పోవాలంటే పొగ పెట్టాలి
కరోనా నేపథ్యంలో ఇల్లు, పరిసరాలు, ఆఫీసులు, దవాఖానలను శుభ్రపరిచేందుకు అక్కడుండే గా లిని స్వచ్ఛ పరచాలి. మహాసాక్షి, కర్పూరం, అవిసె గింజలు, నల్లనువ్వులు, గుగ్గులు, పసుపు కొమ్ములు వంటివాటితో మట్టిపాత్రలో ధూపంవేయాలి. ఆ పొగ ఇల్లంతా వ్యాపింపజేయాలి. బాదాం, అక్రోట్, పూల్ మఖావ్, త్రిఫలాలు, గులాబీ రేకులతో కూడా ధూపం వేయొ చ్చు. ఇంట్లో ప్రతి గదిలోనూ మూతలేకుండా ఓ గిన్నెలో కర్పూరం ఉంచినా సరిపోతుంది. రకరకాల రోగ కారక క్రిములు పోతాయి.
జలుబు, దగ్గు రాకుండా..
పూదీనా సత్వం, కర్పూర సత్వం, అజువాయిస్ సత్వం.. గాజుపాత్రలో సమపాళ్లలో కలిపి మూతగట్టిగా పెట్టాలి. ఈ మిశ్రమం ద్రవంలాగా తయారవుతుంది. దీన్ని వాసన పీల్చడం వల్ల విక్స్లా రుద్దుకోవచ్చు. వేడినీటిలో వేసి ఆవిరి పీల్చడం వల్ల జలువు తగ్గుతుంది. వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా వ్యాధి నిరోధకంగా పనిచేస్తుంది.
ఇవి పాటిస్తే చాలు
నిల్వ పదార్థాలు, ఫ్రిజ్‌లోని కూరగాయలు, అతి చల్లని పానీయాలు వాడొద్దు. కాచిన నీళ్లే తాగాలి. 15 నిమిషాలకోసారి గొంతు తడుపుకోవాలి. తద్వారా గొంతులో ప్రవేశించిన రోగకారక క్రిములు పొ ట్టలోకి వెళ్తాయి. వెల్లుల్లి రేకులు, మిరియాల పొడి, తేనె, అల్లం ర సం, సెనగ గింజంత పసుపు ముద్ద, లవంగా లు, మసాలా పదార్థాలను తిన్నప్పుడు అవి గొంతులోని శ్లేష్మాన్ని కరిగిస్తాయి. కఫదోషాన్ని నివారిస్తాయి. దురాలవాట్లను దూరం చేసుకోవాలి.
–ఆయుర్వేద కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సులోచన