జాతీయం

వందే భార‌త్ మిష‌న్ ఐద‌వ ద‌శ రేపు ప్రారంభం

ఢిల్లీ : వందే భారత్ మిషన్ ఐదవ దశ ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం కానుంది. 23 దేశాల్లో ఉన్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు మొత్తం 792 విమానాల‌ను షెడ్యూల్ చేశారు. వీటిలో 692 అంత‌ర్జాతీయ విమానాలు కాగా 100 దేశీయ విమానాలు ఉన్నాయి. జిసిసి దేశాల‌తో పాటు, యుఎస్, కెనడా, యుకె, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, చైనా, ఇజ్రాయెల్, కిర్గిస్థాన్ దేశాల్లో ఉన్న భార‌తీయుల‌ను స్వ‌దేశానికి తీసుకురానున్నారు. విదేశాల్లో చిక్కుకున్న ఒక ల‌క్షా 30 వేల మంది భార‌తీయుల‌ను దేశంలోని 21 వేర్వేరు విమానాశ్రయాలకు చేర్చ‌నున్న‌ట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close