ఆంధ్రరాజకీయం

వైసీపీది ఆంగ్ల మాధ్యమం కాదు..బూతు మాధ్యమం: పవన్‌

కాకినాడ: రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్‌రెడ్డి అనుచరుల దాడిలో గాయపడిన జనసైనికులను పవన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ఆశయాలతో ప్రధాని ముందుకెళ్తున్నారో..ఆ ఆశయాలు ఏపీలో కనిపించడం లేదని అన్నారు. రాష్ట్రంపై దృష్టిసారించాలని కేంద్రాన్ని కోరానన్నారు. విశాఖ ప్రజలు రాజధానిని కోరుకోలేదని, వైసీపీ నేతలు కోరుకున్నారని విమర్శించారు. వైసీపీది ఆంగ్ల మాధ్యమం కాదని, బూతు మాధ్యమని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు అరాచకాలు ఆపకపోతే ఎంత దూరమైనా వెళ్తామని పవర్ కల్యాణ్ హెచ్చరించారు. పాలెగాళ్ల రాజ్యం తెస్తామంటే చూస్తూ ఊరుకోమన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే మూడు రాజధానులు చేస్తామని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తామని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఎందుకు మాట్లాడుతున్నారని పవన్ నిలదీశారు. వైసీపీ పైకి చెప్పేది ఇంగ్లీష్‌ మాధ్యమం.. వాళ్ల తీరు బూతు మాధ్యమని మరోసారి ఎద్దేవా చేశారు. జనసేన నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ కూర్చోవడం దుర్మార్గమని పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close