ఆంధ్రరాజకీయం

రాజధాని తరలింపుపై పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

గుంటూరు: రాజధాని తరలింపుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా నేతలతో పవన్‌కల్యాణ్ సమవేశం అయ్యారు. జనసేన కార్యాలయానికి అమరావతి రైతులు తరలివచ్చారు. నేతలతో సమావేశం తర్వాత రైతులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. రాజధానిపై కాంగ్రెస్‌, బీజేపీ తమ వైఖరి చెప్పాల కోరారు. విభజన చట్టం ప్రకారం రాజధాని విషయంలో కేంద్రానికి బాధ్యత ఉందని గుర్తుచేశారు. రాజధానిపై కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. భూములిచ్చిన రైతులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజధాని రైతులకు అన్యాయం జరగకూడదని స్పష్టం చేశారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close