సినిమా

పవన్ కోసం ‘భవదీయుడు .. భగత్ సింగ్’ టైటిల్ ఖరారు!

  • ముగింపు దశలో ‘భీమ్లా నాయక్’
  • షూటింగు దశలో ‘వీరమల్లు’
  • రంగంలోకి దిగిన హరీశ్ శంకర్
  • పవన్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే టైటిల్  

పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తరువాత పవన్ భారీ విజయాలను అందుకున్నప్పటికీ, ఆ సినిమా వేసిన ముద్రను మాత్రం ప్రేక్షకులు మరిచిపోలేదు. ఇప్పుడు అదే కాంబినేషన్లో మరో సినిమా రూపుదిద్దుకోనుంది.

మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో, ఈ సినిమాకి సంబంధించిన కసరత్తు కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే, ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను సెట్ చేశారు. భగత్ సింగ్ పేరుకు ముందు భవదీయుడు చేర్చడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకర్షించే ప్రయత్నం చేశారు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిని తీసుకున్నారు. కథానాయికగా పూజ హెగ్డే పేరు వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో స్పష్టత రావలసి ఉంది. పవన్ ఒక వైపున ‘హరి హర వీరమల్లు’ చేస్తూనే, హరీశ్ సినిమాను కూడా చేయనున్నట్టు చెబుతున్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close