జాతీయంటాప్ స్టోరీస్

పాన్, ఆధార్ అనుసంధానం గడువు పొడగింపు..ఎప్పటి వరకూ..?

పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువును పొడిగించింది. పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు నిన్నటితో సమయం  ముగిసిన నేపధ్యంలో, గడువును వచ్చే సంవత్సరం మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), ఓ ప్రకటనను విడుదల చేసింది.

పాన్‌, ఆధార్‌ అనుసంధానం గడువును పొడగించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గతంలో జూన్‌ 30 వరకూ గడువును పొడిగించిన సీబీడీటీ, ఆ గడువు నిన్నటితో ముగియగా, ఆధార్‌ చట్టబద్ధతపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న నేపధ్యంలో, తీర్పు వెలువడేంత వరకూ పాన్, ఆధార్ అనుసంధానం గడువును పొడింగించాలని కేంద్రం నిర్ణయించింది

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close