జాతీయంటాప్ స్టోరీస్

వీషీల్డ్ వ్యాక్సిన్‌.. ఒక డోసుకు రూ.1000

సీర‌మ్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా త‌యారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్‌కు కేంద్ర ప ్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఒక‌వేళ క‌మ‌ర్షియ‌ల్‌గా ఆ టీకాను అమ్మేందుకు అనుమ‌తి ఇస్తే, అప్పుడు ఒక్క డోసును వెయ్యి రూపాయాల‌కు అమ్మ‌నున్న‌ట్లు సీరం సంస్థ చీఫ్ ఆధార్ పూనావాలా తెలిపారు. తొలి కోటి మందికి మాత్రం ప్ర‌త్యేకంగా కేవ‌లం 200 రూపాయ‌ల‌కే టీకాను ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత టెండ‌ర్లు వేసి.. వేర్వేరు ధ‌ర‌ల‌కు వ్యాక్సిన్‌ను అమ్మ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ప్రైవేటు మార్కెట్‌లోకి ఒక‌వేళ వ్యాక్సిన్‌ను అమ్ముకునే ఛాన్స్ ఇస్తే, ఒక్క డోసు వెయ్యికిస్తామ‌న్నారు. 

కోవిడ్ చికిత్స కోసం బూస్ట‌ర్ డోసు కావాల‌ని, దాంతో మొత్తం టీకా ధ‌ర రెండు వేల అవుతుంద‌ని పూనావాలా చెప్పారు. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీతో క‌లిసి ఆస్ట్రాజెన్‌కా ఫార్మా కంపెనీ కోవీషీల్డ్‌ను డెవ‌ల‌ప్ చేశాయి. ఆ టీకాను సీరం సంస్థ ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. రానున్న 10 రోజుల్లో టీకాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని, ఆ త‌ర్వాత వెంట‌నే టీకాల‌ను పంపిణీ చేస్తామ‌ని, వ‌చ్చే నెల‌లో సుమారు 80 మిలియ‌న్ల డోసుల‌ను పంపిణీ చేస్తామ‌న్నారు. మార్చి నెల నాటికి టీకా ఉత్ప‌త్తిని రెండింత‌లు చేస్తామ‌ని,   కానీ ప్రైవేటు మార్కెట్‌లోకి అందుబాటులోకి వ‌చ్చేది మాత్రం ప్రభుత్వ ఆంక్ష‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు.  

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close