జాతీయంటాప్ స్టోరీస్

అస్సాంలో వరదలు : 102 మంది మృతి

గౌహతి : అస్సాం రాష్ట్రంలో 30 జిల్లాల్లో మే 22 నుంచి ఇవాళ్టి వరకు సంభవించిన వరదల కారణంగా సుమారు 57 లక్షల మందిప్రభావితమయ్యారని, 102 మంది మృతి చెందారని ఆ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. నిరాశ్రయులకు 615 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. కాజీరంగా జాతీయ ఉద్యానవనం, టైగర్ రిజర్వ్‌లో మొత్తం 132 జంతువులు మృత్యువాతపడ్డాయి. ఇందులో 14 ఖడ్గమృగాలు, 5 అడవి గేదెలు, 8 అడవి పందులు, 2 చిత్తడి జింకలు, 98 హాగ్ జింకలు, ఓ సాంబార్, 3 పందికొక్కులు, కొండచిలువ ఉన్నాయని వెల్లడించింది. ఆదివారం బార్పేట జిల్లాలో పలు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం (ఎన్డీఆర్ఎఫ్) గ్రామస్తులను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అస్సాంలో వరదలు సంభవించడం ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close