జాతీయం

రాత్రంతా ధ‌ర్నా చేస్తాం -రాజ్య‌స‌భ విప‌క్ష ఎంపీలు

హైద‌రాబాద్‌: అగ్రిక‌ల్చ‌ర్ బిల్లుల‌పై రాజ్య‌స‌భ‌లో దుమారం కొన‌గుతూనే ఉన్న‌ది. ఆదివారం ఆ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ విప‌క్ష స‌భ్యులు నిర‌స‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ 8 మంది విప‌క్ష ఎంపీల‌పై సెష‌న్ మొత్తం స‌స్పెన్ష‌న్ విధించారు. డెరిక్ ఓబ్రెయిన్‌తో పాటు మ‌రో 7 మంది స‌భ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాలంటే ఇవాళ ఉద‌యం చైర్మ‌న్ వెంక‌య్య ఆదేశించారు. కానీ స‌స్పెన్ష‌న్‌కు గురైన విప‌క్ష స‌భ్యులు మాత్రం త‌మ బెంచ్‌ల నుంచి క‌ద‌ల‌లేదు. బిల్లుల‌పై చ‌ర్చ జ‌ర‌కుండా అడ్డుకున్నారు.  తొలుత వెంక‌య్య ప‌లుమార్లు ఆదేశించినా.. స‌స్పెండ్ అయిన ఎంపీలు మాత్రం స‌భ‌లోనే ఉంటూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేప‌థ్యంలో స‌భ‌ను ఉద‌యం 10 గంటల వ‌ర‌కు వాయిదా వేశారు. ఆ త‌ర్వాత డిప్యూటీ చైర్మ‌న్ మ‌రోసారి స‌భ‌ను అర‌గంట సేపు వాయిదా వేశారు.  అల్ల‌ర్ల మ‌ధ్య మ‌రో రెండు సార్లు రాజ్య‌స‌భ వాయిదా ప‌డింది. అయితే రూల్ 256 ప్ర‌కారం.. స‌స్పెండ్ అయిన స‌భ్యులు స‌భ నుంచి వెళ్లిపోవాల‌ని వైస్ చైర్మ‌న్ బుభ‌నేశ్వ‌ర్ క‌లితా ఆదేశించారు. సస్పెండ్ అయిన స‌భ్యులు హౌజ్ నుంచి వెళ్లిపోతేనే ఆ అంశంపై ప్ర‌తిప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ మాట్లాడే అవ‌కాశం ఇస్తాన‌న్నారు. కానీ విప‌క్ష స‌భ్యులు మాత్రం త‌మ ప‌ట్టువీడ‌లేదు. రూల్ 256 ప్ర‌కారం స‌స్పెండ్ అయిన స‌భ్యులు బ‌య‌టికి వెళ్తేనే కార్య‌క‌లాపాలు జ‌రుగుతాయ‌ని డిప్యూటీ చైర్మ‌న్ ప‌లుమార్లు పేర్కొన్నారు. కానీ ఆందోళ‌న‌లు ఆగ‌క‌పోవ‌డంతో.. రాజ్య‌స‌భ‌ను రేప‌టికి వాయిదా వేశారు. అయితే విప‌క్ష స‌భ్యులు రాత్రంతా పార్ల‌మెంట్ హౌజ్‌లో ధ‌ర్నా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  కాంగ్రెస్‌, ఎస్పీ, డీఎంకే, సీపీఐ-ఎం, సీపీఐ, ఆప్‌, ఐయూఎంఎల్‌, టీఆర్ఎస్‌, తృణ‌మూల్ కాంగ్రెస్‌,శివ‌సేన‌, ఎన్సీపీ పార్టీలు మౌన‌ధ‌ర్నాలో పాల్గొన‌నున్న‌ట్లు ఎంపీ డెరిక్ ఓబ్రెయిన్ తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close