స్పెషల్

నిరుద్యోగుల ఆత్మహత్యలే అధికం

  • 2018లో 12,936 ఆత్మహత్యలు నమోదు
  • 12.3 శాతంతో తొలిస్థానంలో కేరళ
  • తర్వాతి స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌
  • నేషనల్‌ క్రైంరికార్డ్స్‌ బ్యూరో అధ్యయనం వెల్ల

 దేశవ్యాప్తంగా రోజురోజుకూ నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రైతుల కంటే నిరుద్యోగులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడి అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని నేషనల్‌ క్రైంరికార్డ్స్‌ బ్యూరో (ఎన్సీఆర్బీ) 2018లో నిరుద్యోగ ఆత్మహత్యలపై నిర్వహించిన సర్వేలో పలు ఆశ్చర్యకర అంశాలు వెల్లడయ్యాయి. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతి గంటకు ఒక నిరుద్యోగి చొప్పున బలవంతంగా ప్రాణాలు వదులుతున్నారు. మొత్తం ఆత్మహత్యలు 1,34,516 గా నమోదు కాగా, అందులో 9.6 శాతం.. 12,936 నిరుద్యోగులవే. వారిలో 10,687 మంది పురుషులు, 2,249 మంది మహిళలు. 12.3 శాతం (1,585 మంది)తో కేరళ మొదటిస్థానంలో.. రెండో స్థానంలో తమిళనాడు (1,579 మంది), మూడో స్థానంలో మహారాష్ట్ర (1,260 మంది), నాలుగో స్థానంలో కర్ణాటక (1,094 మంది), ఐదో స్థానంలో ఉత్తరప్రదేశ్‌ (902 మంది) ఉన్నాయి. మొత్తం నిరుద్యోగుల ఆత్మహత్యల్లో ఈ ఐదు రాష్ర్టాలకు చెందినవారే 49.7 శాతం మంది ఉన్నారు.

ఏటా పెరుగుతున్న ఆత్మహత్యలు

దేశంలో ఏటేటా నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2017లో 12,241 మంది (9.4శాతం) నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోగా.. అదే ఏడాది 10,655 మంది (8.2 శాతం) రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. 2016లో 11,379 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. నిరుద్యోగుల సంఖ్య 11,173 గా ఉన్నది. 2017లో 12,241 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడగా.. 2018లో అవి మరింతగా పెరిగి 12,936 కు చేరుకుంది.

unemployed1

స్టార్టప్‌ల వైపు దృష్టి సారించాలి

srinivas-reddy

పిల్లలు చిన్ననాటి నుంచి ఉద్యోగమే లక్ష్యంగా చదువుతున్నారు. ఉద్యోగం లేకపోతే బతకలేమన్న భావనలో జీవిస్తున్నారు. చివరకు ఏ రంగంలోనూ రాణించక నిరాశకు గురై ఆత్మహత్యల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిస్థితి నుంచి నిరుద్యోగులను బయటకు తీసుకురావాలంటే స్వయం ఉపాధి వైపు మొగ్గుచూపేలా అవగాహన కల్పించారు. స్టార్టప్‌ల వైపు దృష్టి సారించేలాచేసి వారిని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకురావాలి.
– అట్ల శ్రీనివాస్‌రెడ్డి, రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్‌

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close