సినిమా

ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..

  • నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను: చిరంజీవి 
  • కొమరం భీమ్‌గా భారత్ మొత్తం నీ ఖ్యాతి మారుమోగాలి: రాఘవేంద్రరావు
  • హ్యాపీ బర్త్ డే: నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు, పురందేశ్వరి 

జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌ డే భీమ్‌.. తారక్‌.. నీ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.

‘మా ఎన్టీఆర్‌కి జన్మదిన శుభాకాంక్షలు. అద్భుతమైన నటన, అభినయంతో తెలుగు ప్రేక్షకాభిమానుల్ని రెండు దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నావు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో కొమరం భీమ్ గా భారతదేశం మొత్తం నీ ఖ్యాతి మారుమోగాలని ఆశిస్తున్నాను’ అంటూ దర్శకుడు రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. ‘హ్యాపీ బర్త్ డే నాన్నా’ అంటూ నందమూరి కల్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. సినీ పరిశ్రమలో తన ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచీ తనతో కలిసి తారక్‌ ఉన్నందుకు సంతోషంగా ఉందంటూ రాజమౌళి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు బిగ్‌బాస్‌-1 హౌస్‌మేట్స్‌ ఆయనకు ఓ వీడియో రూపంలో శుభాకాంక్షలు చెప్పారు. దీన్ని సంగీత దర్శకుడు తమన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ వీడియో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. బిగ్‌బాస్‌1 లోని హౌస్‌మేట్స్‌ అందరూ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనతో గతంలో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ నేతలు నారా లోకేశ్, గంటా శ్రీనివాసరావు, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close