జాతీయంటాప్ స్టోరీస్టెక్నాలజీబ్రేకింగ్ న్యూస్రాజకీయం

40లక్షల మందికి దక్కని పౌరసత్వం

అసోం ప్రభుత్వం ఎన్‌ఆర్‌సీ ముసాయిదా విడుదల చేసింది. స్థానికులు, స్థానికేతలను గుర్తించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాను తయారు చేసింది. జాబితాలో 3.29 కోట్ల మంది జనాభాలో 2.89 కోట్ల మందికి పౌరసత్వం లభించింది. ఎన్‌ఆర్‌సీలో 40లక్షల మందికి పౌరసత్వం దక్కలేదు. అంతకుముందు ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు తలెత్తకుండా రాష్ట్ర మంతటా పోలీసులతో పాటు 220 కంపెనీల సాయుధ బలగాలను మోహరించారు. బర్పెట, దరంగ్‌, దిమా హసోవ్‌, సోనిట్‌పుర్‌, కరీమ్‌గంజ్‌, గోలాఘాట్‌, ధుబ్రి జిల్లాలో అధికారులు 144 సెక్షన్‌తో పాటు నిషేధాజ్ఞలు విధించారు. 1971 మార్చి 25కు ముందు రాష్ట్రంలో నివాసమున్న వారినే స్థానికులుగా గుర్తించారు. అసొం ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 31న విడుదల చేసిన తొలి ముసాయిదాలో మొత్తం 3.29 కోట్ల మందిలో కేవలం 1.9 కోట్ల మందినే అసొ పౌరులుగా గుర్తించి జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన జాబితాతో 2,89,83,677 మందికి పౌరసత్వం లభించింది.

ప్రస్తుతం విడుదల చేసింది ప్రభుత్వం గుర్తించిన జాబితా అని.. తుది జాబితా కాదని ఎన్‌ఆర్‌సీ అసోం సమన్వయకర్త ప్రతీక్‌ హజేలా అన్నారు. అక్రమ వలసలను నిరోధించేందుకు ఈ ముసాయిదాను ప్రకటించామని.. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. పాకిస్థాన్‌, ఆప్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి మైనార్టీల అక్రమ వలసలు కొనసాగడం వల్లే పౌరసత్వ జాబితాను రూపొందించాల్సి వచ్చిందని నార్త్‌ ఈస్ట్‌ జాయింట్‌ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్‌ తెలిపారు. తాజా ముసాయిదా జాబితాలో రూపొందించాల్సి వచ్చిందని నార్త్‌ ఈస్ట్‌ జాయింట్‌ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్‌ తెలిపారు. తాజా జాబితాతో పౌరసత్వం దక్కని వలస మైనార్టీ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close