ఆంధ్రపశ్చిమ గోదావరిస్పెషల్

వారం రోజులు నాన్‌ వెజ్‌కు హాలీడే

పశ్చిమ గోదావరి : తణుకు నియోజకవర్గంలో ఓ వైరస్‌ కారణంగా ఫారాల్లోని కోళ్లన్నీ విపరీతంగా చనిపోతున్నాయని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి  వెంకట నాగేశ్వరరావు తెలిపారు. చనిపోయిన వైరస్ కోళ్లను కాలువల్లో, రొడ్డు పక్కన వేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మున్సిపల్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందిని అలర్ట్‌ చేశామని పేర్కొన్నారు. అదే విధంగా తణుకు నియోజకవర్గంలో రేపటి నుంచి వారం రోజులు చికెన్, మటన్‌ అమ్మకాలు నిలిపి వేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా భావించి వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు.

Tags
Back to top button
error: Content is protected by G News !!
Close
Close