ఆంధ్ర

ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ఎన్నికలు నిలిచిన 14 జెడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

►గ్రామపంచాయతీల నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ.
►మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు: 8వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
►పరిషత్‌ ఎన్నికలు: ఈ నెల 9న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ

ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు నిర్వహణ, ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 17న వీటి కౌంటింగ్‌ జరగనుంది. ఈ నెల 16న పరిషత్‌ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. 18న కౌంటింగ్‌ జరగనుంది. 

నెల్లూరు కార్పొరేషన్‌తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు.. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. 

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close