తెలంగాణ

దళితబంధును ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు -డీకే అరుణ

  • హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధును తీసుకొచ్చారు
  • కులాల పేరుతో ప్రజలను విభజించి లాభం పొందాలనుకుంటున్నారు
  • వికారాబాద్ జిల్లా ప్రజలను కేసీఆర్ ముంచేశారు

టీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. మరోవైపు ఈ పథకంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారనే విషయం ప్రజలందరికీ అర్థమయిందని… ఆ పథకాన్ని ఎవరూ నమ్మరని చెప్పారు.

వికారాబాద్ జిల్లా ప్రజలను సీఎం కేసీఆర్ నిండా ముంచేశారని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని… ఆ డబ్బును ఎన్నికల్లో వెదజల్లుతున్నారని ఆరోపించారు. కులాల పేరుతో ప్రజలను విభజించి లాభం పొందాలని కేసీఆర్ యత్నిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.

Tags

Related Articles

Back to top button
error: Content is protected by G News !!
Close
Close